sensex: ఆర్బీఐ పాలసీ మీటింగ్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • వరుసగా మూడో రోజు నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు
  • 97 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 70 శాతం పైగా నష్టపోయిన ఇన్ఫీబీమ్ అవెన్యూస్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాలను మూటగట్టుకున్నాయి. వచ్చే వారం ఆర్బీఐ పాలసీ మీటింగ్ ఉన్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు అప్రమత్తతతో వ్యవహరించారు. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 97 పాయింట్లు నష్టపోయి 36,227కు పడిపోయింది. నిఫ్టీ 47 పాయంట్లు కోల్పోయి 10,930 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డీబీ కార్ప్ (6.15), ఇండియన్ హోటల్స్ (5.29), కేఈఐ ఇండస్ట్రీస్ (4.96), బీఏఎస్ఎఫ్ ఇండియా (4.69), క్యాన్ ఫిన్ హోమ్స్ (4.43).

టాప్ లూజర్స్:
ఇన్ఫీ బీమ్ అవెన్యూస్ ( 70.24), లక్ష్మి విలాస్ బ్యాంక్ (19.81), జైన్ ఇరిగేషన్ (15.46), కాక్స్ అండ్ కింగ్స్ (13.28), జిందాల్ స్టీల్ అండ్ పవర్ (12.47).

More Telugu News