Revanth Reddy: రేవంత్ ఖాతాలో ఒకే రోజు రూ. 9 కోట్లు డిపాజిట్ చేసిన రఘువరన్ మురళి... ఎవరితను?

  • నిన్నటి నుంచి రేవంత్ ఇళ్లలో సోదాలు
  • వెలుగులోకి పలు ఆసక్తికర అంశాలు
  • ఫిబ్రవరి 25, 2014న ఒక్కరోజే భారీ మొత్తంలో నగదు బదిలీ

ఆదాయానికి మించి ఆస్తులను కలిగివున్నారన్న కోణంతో పాటు, ఓటుకు నోటు కేసులో స్టీవెన్ సన్ కు ఇవ్వజూపిన రూ. 50 లక్షలు ఎక్కడివో తేల్చే ఉద్దేశంతో నిన్నటి నుంచి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో, రేవంత్ ఆస్తులు, ఆయన బ్యాంకు ఖాతాలపై ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. రేవంత్ రెడ్డికి హాంకాంగ్ లో ఖాతా ఉందని, దాని నంబర్ 1260779653146 అని ఈడీ గుర్తించినట్టు తెలుస్తోంది. 2014, ఫిబ్రవరి 25న సింగపూర్ లో ఉన్న తన స్థిరాస్తిని రేవంత్ విక్రయించగా, 60 లక్షల రింగెట్స్ ను రఘువరన్ మురళీ అనే వ్యక్తి, తన ఆర్ హెచ్బీ బ్యాంకు ఖాతా (100482930330069) నుంచి బదిలీ చేశారని, ఈ లావాదేవీలు దఫదఫాలుగా సాగాయని సమాచారం.

ఇక అదే రఘువరన్ మురళి, రేవంత్ రెడ్డికి చెందిన ఆర్ హెచ్బీ బ్యాంకు ఖాతా (1300098050844099)కు 20 లక్షల సింగపూర్ డాలర్లు (సుమారు రూ. 9.53 కోట్లు) పంపించాడని, ఆ ఒక్క రోజే సుమారు రూ. 20 కోట్ల విదేశీ మారకం జరిగిందని అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ లావాదేవీల వెనుక రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి ఉన్నాడని, రేవంత్ మరో తమ్ముడు జగన్ రెడ్డికి కూడా పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఇప్పుడు ఈ రఘువరన్ మురళి ఎవరన్న కోణంలో ఈడీ, ఐటీ అధికారులు రేవంత్ ను, ఆయన సోదరులను ప్రశ్నిస్తున్నారు.

More Telugu News