Nagarjuna: నాగార్జున విషయంలో వికీపీడియా ఏమైనా తప్పు చూపిస్తోందా?: 'ఆర్ఎక్స్ 100' హీరో కార్తికేయ

  • సార్ మీకో నమస్కారం
  • 20 ఏళ్ల హీరోలకు సవాల్ విసురుతున్నారు
  • ట్విట్టర్ లో నటుడు కార్తికేయ

"వికీపీడియా ఏమైనా తప్పు చూపిస్తోందా? ఈ మనిషి వయసు 59 అని చెబుతోంది. నాగార్జున సార్.. మీకు నమస్కారం. ఆయన తన ఫిట్‌ నెస్‌తో 20 ఏళ్ల హీరోలకు కూడా సవాల్ విసురుతున్నారు. ఏమున్నాడ్రా బాబూ" అని అన్నాడు ఇటీవల 'ఆర్ఎక్స్100' చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన హీరో కార్తికేయ. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, నిన్న విడుదలైన 'దేవదాసు' మూవీ స్టిల్ ను పోస్ట్ చేశాడు కార్తికేయ. ఈ స్టిల్ చూస్తుంటే కార్తికేయ చెప్పింది నిజమేననిపిస్తోంది. కండలు తిరిగిన శరీరంతో దర్శనమిస్తున్న నాగ్, యంగ్ హీరోలకు రియల్ చాలెంజ్ విసురుతున్నారు.

More Telugu News