Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు!

  • జూబ్లీహిల్స్ సహా 15 చోట్ల కొనసాగుతున్న సోదాలు
  • రేవంత్ కు అమెరికా, హాంకాంగ్, మలేషియాల్లో ఆస్తులు
  • కౌలాలంపూర్, హాంకాంగ్ బ్యాంకులలో అకౌంట్లు

టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సహా 15 చోట్ల ఈరోజు ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. బ్లాక్ మనీ, ఇన్ కంట్యాక్స్ చట్టం 2015, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం 2002 కింద, ప్రొహిబిషన్ ఆఫ్ బినామీ ట్రాన్జాక్షన్ యాక్ట్1988, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు 1988 కింద రేవంత్ పై అధికారులు అభియోగాలు మోపారు.

రేవంత్ రెడ్డికి అమెరికా, హాంకాంగ్, మలేషియాలలో ఆస్తులున్నట్లు ఆరోపణలు. కౌలాలంపూర్ లోని ఆర్ హెచ్ బీ బ్యాంక్ లో రేవంత్ రెడ్డి ఖాతాలో ఒకే రోజు 20 లక్షల సింగపూర్ డాలర్లు, హాంకాంగ్ లోని బ్యాంక్ ఆఫ్ ఈస్ట్ ఏసియాలో ఉన్న రేవంత్ అకౌంట్ లో 2014లో ఒకే రోజు 60 లక్షల మలేషియా రిగ్గెట్లు జమైనట్టు ఈ సోదాల్లో తెలిసింది.

కాగా, ఐటీ అధికారుల సమాచారం మేరకు కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. రేవంత్ కోసం ఎదురుచూస్తున్న అధికారులు ఆయన రాగానే నివాసంలోకి తీసుకెళ్లారు. 

More Telugu News