sensex: పలు వస్తువులపై దిగుమతి సుంకాల పెంపు.. బేర్ మన్న మార్కెట్లు!

  • 218 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 11వేల దిగువకు చేరిన నిఫ్టీ
  • 17 శాతం నష్టపోయిన ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రా

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం, పలు వస్తువులపై భారత ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. దీనికి తోడు సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 218 పాయింట్లు నష్టపోయి 36,324కు పడిపోయింది. నిఫ్టీ 76 పాయింట్లు పతనమై 10,977కు చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ప్రిస్టేజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ (9.00), హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ (6.44), వక్రాంగీ (4.99), ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ (4.76), నీల్ కమల్ లిమిటెడ్ (4.20).

టాప్ లూజర్స్:
ఎస్ఆర్ఈఐ ఇన్ఫ్రా (17.00), ఇండియాబుల్స్ రియలెస్టేట్ (10.36), ఎడిల్ వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (10.35), యస్ బ్యాంక్ (9.14),  క్యాన్ ఫిన్ హోమ్స్ (8.48).

More Telugu News