kcr: రేవంత్ రెడ్డి ఇంటి ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నం.. పలువురి అరెస్ట్

  • రేవంత్ ఇంటిపై ఐటీ దాడులు
  • ఆయన ఇంటి వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
  • కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో... కాంగ్రెస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులకు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలు సహా పలువురు నేతలు హైదరాబాదులోని రేవంత్ ఇంటి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. వారి ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు... పలువురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

More Telugu News