google: హ్యాపీ బర్త్‌డే: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న గూగుల్ సెర్చ్ ఇంజన్

  • 1998లో ప్రారంభించిన సర్జీ బ్రిన్‌, లారీ పేజ్‌
  • 20 ఏళ్లు పూర్తి చేసుకున్న వీడియో విడుదల
  • ప్రస్తుతం 150 భాషలలో 190 దేశాల్లో గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవలు

ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్ 20వ పుట్టిన రోజు నేడు. ఈ రోజుల్లో మనకి ఏ సందేహం వచ్చినా, ఎలాంటి సమాచారం కావాలన్నా యూజర్లకు క్షణాల్లో అందించే 'గూగుల్ సెర్చ్ ఇంజన్' ఆవిర్భవించి నేటికి 20 ఏళ్లు పూర్తి అయింది. 1998లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సర్జీ బ్రిన్‌, లారీ పేజ్‌లు ఈ సెర్చ్ ఇంజిన్ ని ప్రారంభించారు. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గూగుల్ డూడుల్, ఓ వీడియోను విడుదల చేసింది. కాగా, గూగుల్ ప్రస్తుతం 150 భాషలలో 190 దేశాల్లో తన సేవలని  అందిస్తోంది.

More Telugu News