telangana: అసెంబ్లీ రద్దయిన రోజు నుంచే తెలంగాణలో మోడల్ కోడ్ అమలులోకి వచ్చింది!: కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టీకరణ

  • కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు అమల్లో ఉండనున్న కోడ్
  • కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించరాదు 
  • అనధికార కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులను వినియోగించుకోరాదు

తెలంగాణలో మోడల్ కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది. అసెంబ్లీ రద్దయిన నాటి నుంచే కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేసింది. ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే ఈ నియమావళి అమల్లో ఉందని తెలిపింది.

కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఈ కోడ్ అమల్లో ఉంటుందని చెప్పింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఎలాంటి విధానపరమైన, కీలకమైన నిర్ణయాలు తీసుకోరాదంటూ కేసీఆర్ కు సూచించింది. కొత్త పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించకూడదని షరతు విధించింది. అనధికార కార్యక్రమాలకు ప్రభుత్వ వనరులను వినియోగించుకోరాదని తెలిపింది.

More Telugu News