Prime Minister: దేశ ప్రధానిని.. నా ఫోన్ కాల్స్ కూడా కట్ అవుతున్నాయి!: టెలికాం అధికారులతో ప్రధాని మోదీ

  • గతంలో పలుమార్లు కట్ అయ్యాయని వెల్లడి
  • జరిమానా వివరాలు అడిగి తెలుసుకున్న మోదీ
  • కాల్ డ్రాప్ లను నియంత్రించాలని ఆదేశం

సాధారణంగా అవతలివారితో ఫోన్ లో మాట్లాడుతుండగా అప్పుడప్పుడూ కాల్ కట్ అయిపోతుంటాయి. మామూలూ ఫోన్ కాల్స్ అయితే ఓకే కానీ అత్యవసరంగా మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే పిచ్చకోపం వచ్చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చాలాసార్లు ఇలాంటి ఇబ్బంది ఎదురయిందట. ఆయన ఫోన్ లో మాట్లాడుతుండగానే చాలాసార్లు లైన్ కట్ అయిపోయిందట. ఈ విషయాన్ని ప్రధాని మోదీనే స్వయంగా వెల్లడించారు.

ప్రభుత్వ పథకాలను సమీక్షించడంలో భాగంగా మోదీ ఉన్నతాధికారులతో తరచూ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అవుతూ ఉంటారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో టెలికాం శాఖ కార్యదర్శి  అరుణ సుందరరాజన్ ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ప్రధానికి వివరించారు. వీటిలో కాల్ డ్రాప్స్ కూడా ఉన్నాయని చెప్పారు. దీంతో తనకు కూడా ఈ సమస్య ఎదురైందనీ, తాను ఫోన్ లో మాట్లాడుతుండగా గతంలో పలుమార్లు కాల్స్ కట్ అయిపోయాయని మోదీ తెలిపారు.

అనంతరం ఇలా ఫోన్ కాల్ అకారణంగా కట్ అయిపోతే ఆపరేటర్ల నుంచి ఎంత జరిమానాను వసూలు చేస్తున్నారని మోదీ ప్రశ్నించారు. దీంతో ప్రతి 3 కాల్ డ్రాప్ప్ కు రూ.1 జరిమానా విధిస్తున్నట్లు అధికారులు ప్రధానికి తెలిపారు. ఈ నేపథ్యంలో కాల్ డ్రాప్ సమస్యను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

More Telugu News