Narendra Modi: నరేంద్ర మోదీకి ఐరాస అత్యున్నత పురస్కారం

  • సౌర విద్యుత్ భాగస్వామ్యాలు కుదుర్చుకోవడంలో ముందున్న మోదీ
  • పాలసీ లీడర్ షిప్ విభాగంలో అవార్డు
  • ఫ్రాన్స్ అధ్యక్షుడితో కలసి పంచుకోనున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి అత్యున్నత పర్యావరణ పురస్కారాన్ని ప్రకటించి గౌరవించింది. అంతర్జాతీయ స్థాయిలో సౌర విద్యుత్ భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంలో చూపుతున్న నాయకత్వ లక్షణాలు, 2022 నాటికి ఇండియాను ప్లాస్టిక్ రహిత దేశంగా మారుస్తామని చేసిన ప్రతిజ్ఞలను గౌరవిస్తూ, ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఐరాస పర్యావరణ విభాగం వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా పర్యావరణాన్ని జనహితంగా మార్చేందుకు కృషి చేస్తున్న ఆరుగురిని ఎంపిక చేయగా, వారిలో మోదీ పేరు కూడా ఉంది. పర్యావరణ విభాగంలోని పాలసీ లిడర్ షిప్ కేటగిరీలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, మోదీలు కలసి ఈ అవార్డును అందుకోనున్నారు. ఇదే సమయంలో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సస్టెయినబుల్ ఎనర్జీ విభాగంలో ఐరాస అవార్డును ప్రకటించింది.

More Telugu News