AC: ఏసీలు, ఫ్రిజ్‌లు మరింత ప్రియం.. దిగుమతి సుంకాన్ని భారీగా పెంచిన ప్రభుత్వం!

  • విదేశాల నుంచి దిగుమతి అయ్యే 19 వస్తువులపై సుంకం పెంపు
  • పది శాతం నుంచి 20 శాతానికి పెంచిన ప్రభుత్వం
  • బుధవారం అర్ధ రాత్రి నుంచే అమల్లోకి

ఏసీలు, రిఫ్రిజరేటర్లు నేటి నుంచి మరింత ప్రియం అయ్యాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 19 వస్తువులపై దిగుమతి సుంకం పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం అర్ధ రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. ప్రభుత్వం దిగుమతి సుంకం విధించిన వాటిలో జెట్ ఇంధనంతోపాటు ఏసీలు, రిఫ్రిజరేటర్లు కూడా ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతులను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 ఇప్పటి వరకు ఈ 19 వస్తువులు 10 శాతం సుంకం కింద ఉండగా, ఇప్పుడివి 20 శాతానికి చేరాయి. ఈ వస్తువుల దిగుమతుల విలువ దాదాపు రూ.86 వేల కోట్లని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడంతో  వాషింగ్‌ మెషీన్లు, స్పీకర్లు, రేడియల్‌ కార్‌ టైర్లు, ఆభరణాలు, కిచెన్, టేబుల్‌వేర్‌, ప్లాస్టిక్‌ వస్తువులు, సూట్‌కేసుల ధరలు కూడా పెరగనున్నాయి.

More Telugu News