Donald Trump: ఇలాంటి స్పందన ఊహించలేదు: ఐరాసలో సభికుల నవ్వులపై ట్రంప్

  • ట్రంప్ మాట్లాడుతుండగా నవ్విన సభ్యులు
  • ఉత్తర కొరియాలో అణ్వాయుధాల తయారీ తగ్గింది
  • ఏడాది క్రితం తొలిసారి మీ ముందు నిల్చున్నా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఐక్యరాజ్య సమితిలో ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన మాట్లాడుతున్న సమయంలో సభలోని సభ్యులు పెద్దగా నవ్వారు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలో తాము సాధించిన అభివృద్ధిని అమెరికా చరిత్రలో ఏ యంత్రాంగం సాధించలేదని ట్రంప్ అన్నారు. ఆ సమయంలో సభలోని వారు ఫక్కున నవ్వారు. ఆ హఠాత్పరిణామానికి వెంటనే తేరుకున్న ట్రంప్ తాను కూడా చిన్నగా నవ్వి... 'ఇలాంటి స్పందన నేను ఊహించలేదు.. సరే కానీయండి' అన్నారు.

ఏడాది క్రితం ఈ సభలో తాను తొలిసారి మీ ముందు నిల్చున్నానని... ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి, మెరుగైన భవిష్యత్తు గురించి మాట్లాడానన్నారు. ట్రంప్‌ తన ప్రసంగంలో.. పన్నుల తగ్గింపు, స్టాక్‌మార్కెట్లు రికార్డు స్థాయిలో పెరగడం, డిఫెన్స్‌ నిధుల గురించి మాట్లాడారు. ఉత్తర కొరియాలో అణ్వాయుధాల తయారీ తగ్గిందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాకు, ఇతర దేశాలకు మధ్య ప్రస్తుతం నడుస్తున్న వివాదాస్పద అంశం వాణిజ్యమని ట్రంప్‌ వెల్లడించారు. అమెరికాలో నిరుద్యోగం చాలా తగ్గిందని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News