amithabh: 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' తెలుగు టైటిల్ రిలీజ్

  • అమితాబ్ .. ఆమిర్ ల భారీ చిత్రం 
  • కీలకపాత్రల్లో కత్రినా .. ఫాతిమా
  • దీపావళికి భారీ విడుదల    

యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మాణంలో 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ ' సినిమా రూపొందింది. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ .. ఆమిర్ ఖాన్ .. కత్రినా కైఫ్ .. ఫాతిమా సనా షేక్ ప్రధానమైన పాత్రలను పోషించారు. రీసెంట్ గా ఈ సినిమాలోని ప్రధాన పాత్రల ఫస్టులుక్స్ ను రిలీజ్ చేశారు. వీటికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రిలీజ్ చేశారు. అలాగే అమితాబ్ .. ఆమిర్ ఖాన్ మాట్లాడిన వీడియో క్లిప్ ను కూడా వదిలారు. "మేమిద్దరం కలిసి తొలిసారిగా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' సినిమాతో వస్తున్నాం .. ఈ స్పెషల్ ఫిల్మ్ ను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాం .. ఈ దీపావళికి సినిమా హౌస్ లో కలుద్దాం" అని అమితాబ్ .. ఆమిర్ ఖాన్ తెలుగులో చెప్పడం విశేషం. నవంబర్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.

More Telugu News