samanta: 23 కోట్లు వసూలు చేసిన 'యూటర్న్'

  • సమంత ప్రధాన పాత్రధారిగా 'యూటర్న్'
  • తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమా 
  • సమంత ఖాతాలోకి చేరిన మరో హిట్

సమంత ప్రధాన పాత్రను పోషించిన 'యూటర్న్' .. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడలో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్న సినిమాకి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకూ ఈ థ్రిల్లర్ మూవీ 23 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించబడిన ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది సమంత నటించిన అన్ని సినిమాలు వరుస విజయాలను సాధించాయి. 

More Telugu News