Telangana: గల్ఫ్ గోస.. దుబాయ్ లో చిక్కుకున్న తెలంగాణ వాసుల్ని తీసుకొచ్చేందుకు వెళ్లనున్న కేటీఆర్!

  • నేడు లేదా రేపు ప్రయాణం
  • దుబాయ్ ఉన్నతాధికారులతో చర్చలు
  • ఎంతమంది ఉన్నా విమానం టికెట్లు ఇవ్వాలని నిర్ణయం

తెలంగాణ మంత్రి కె.తారక రామారావు ఈ రోజు లేదా రేపు దుబాయ్ వెళ్లనున్నారు. అక్కడ వీసా కాలపరిమితి ముగిసిపోవడంతో జైళ్లలో చిక్కుకున్న చాలామంది తెలంగాణ వాసుల్ని స్వదేశానికి రప్పించేందుకు మంత్రి దుబాయ్ పర్యటన చేపట్టనున్నారు. తమ జైళ్లలో మగ్గుతున్న దేశీయులను విడుదల చేయాలని దుబాయ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చురుగ్గా స్పందించింది.

హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు దుబాయ్ కి వెళ్లనున్నట్లు సమాచారం. అధికారుల బృందం తొలుత దుబాయ్ కు చేరుకుని క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత..మంత్రి కేటీఆర్‌ అక్కడకు వెళతారు. అనంతరం అక్కడి అధికారులతో చర్చలు జరిపి తెలంగాణ వాసులను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు.

స్వదేశానికి తిరిగివచ్చే తెలంగాణ వాసులకు సంఖ్యతో నిమిత్తం లేకుండా విమానం టికెట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దుబాయ్ ప్రభుత్వం ప్రకటించిన అమ్నెస్టీ పథకం కింద నిన్న 11 మంది తెలంగాణ వాసులు స్వగ్రామాలకు చేరుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News