balakrishna: 'ఎన్టీఆర్' కోసం విఠలాచార్య పాత్రలో యువ దర్శకుడు

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్'
  • సంగీత దర్శకుడిగా కీరవాణి 
  • సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు

బాలకృష్ణ ప్రధాన పాత్రగా క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' సినిమా రూపొందుతోంది. విద్యాబాలన్ .. బసవతారకం పాత్రను పోషించిన ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. చంద్రబాబు నాయుడు పాత్రను రానా .. అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్ .. శ్రీదేవి పాత్రను రకుల్ పోషిస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

ఈ సినిమాలో విఠలాచార్య పాత్రలో ఎన్.శంకర్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. విఠలాచార్య దర్శకత్వంలో పలు జానపద చిత్రాల్లో ఎన్టీఆర్ నటించారు. ఈ ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన ఈ ఇద్దరికీ సంబంధించిన సన్నివేశాలు కూడా ఈ సినిమాలో చోటుచేసుకోనున్నాయి. ఆల్రెడీ ఎన్. శంకర్ షూటింగులో పాల్గొంటున్నాడని అంటున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.   

More Telugu News