America: ఐరాసలో భారత్‌ను ప్రశంసించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

  • భారత్‌లో పేదరికం క్రమంగా కనుమరుగవుతోంది
  • లక్షలాది మంది పేదలు మధ్య తరగతికి మారుతున్నారు
  • 35 నిమిషాలపాటు సాగిన ట్రంప్ ప్రసంగం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. మంగళవారం ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన ట్రంప్ పేదరికం నుంచి భారత్ లక్షలాదిమందిని బయటపడేస్తోందని కితాబిచ్చారు. వందకోట్ల పైబడిన జనాభా కలిగిన స్వేచ్ఛా భారతంలో లక్షలాదిమందికి పేదరికం నుంచి విముక్తి కలుగుతోందన్నారు.  వారందరూ మధ్యతరగతిగా మారుతున్నారని ప్రశంసల వర్షం కురిపించారు.

దాదాపు 35 నిమిషాల పాటు మాట్లాడిన ట్రంప్.. ఇక్కడ ఇంతకుముందు కూడా చాలామంది నేతలు వచ్చి తమ దేశంలోని సమస్యలను వివరించారని, ఇప్పుడు కూడా వారు చెప్పిన సమస్యల చుట్టూనే మన ఆలోచనలు పరిగెడుతున్నాయన్నారు. అయితే, మనందరం మన పిల్లలకు ఎటువంటి ప్రపంచాన్ని ఇవ్వాలనుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలని ట్రంప్ కోరారు.

More Telugu News