New York Times: 'రేప్ జరగగానే ఎందుకు ఫిర్యాదు చేయరు?' అన్న ట్రంప్ ట్వీట్ పై వాషింగ్టన్ పోస్ట్ ఎడిట్ పేజీలో స్పందించిన పద్మా లక్ష్మి!

  • ట్రంప్ ట్వీట్ ను తప్పుపడుతున్న నెటిజన్లు
  • ప్రత్యేక వ్యాసం రాసిన సూపర్ మోడల్ పద్మా లక్ష్మి
  • తనకు ఎదురైన అనుభవాన్ని వివరించిన వైనం

తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన క్రిస్టీన్ బ్లాసీని టార్గెట్ చేస్తూ, ట్రంప్ చేసిన ట్వీట్ వైరల్ కాగా, ఎంతోమంది దాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. "రేప్ జరుగగానే ఎందుకు ఫిర్యాదు చేయలేదు? 1980లో ఘటన జరిగితే ఇంతవరకూ ఎందుకు బయట పెట్టలేదు" అంటూ 'వై ఐ డిడ్ నాట్ రిపోర్ట్' అన్న హ్యాష్ ట్యాగ్ ను ట్రంప్ తగిలించగా, పలువురు స్పందించారు. ప్రముఖ దినపత్రిక 'న్యూయార్క్ టైమ్స్' సంపాదకీయ పేజీకి ప్రత్యేక వ్యాసాన్ని రాసిన సూపర్ మోడల్, భారత సంతతి అమెరికన్ పద్మా లక్ష్మి, తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వెల్లడిస్తూ, ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు.

"ఆనాటి ఘటన గత వారం రోజులుగా నన్ను తరుముతోంది. ట్రంప్ తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్న బ్రెట్ కవన్నా... ఇద్దరు మహిళలను ప్రశ్నించారు. వారిద్దరూ తాము రేప్ కు గురైనప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగారు. అందుకే నేను ఇలా స్పందిస్తున్నా..." అని పద్మా లక్ష్మి పేర్కొన్నారు.

"అప్పటికి నాకు 16 సంవత్సరాలు. నేను కన్యనే. నేను డేటింగ్ చేస్తున్న 23 ఏళ్ల యువకుడు ఓ రాత్రి నాపై తొలిసారి అత్యాచారం చేశాడు. నాకు గుర్తున్న వివరాల ప్రకారం, నా కాళ్ల మధ్య కత్తితో పొడిచినంత బాధగా ఉంది. రక్తం కారుతోంది. నాపై అతనున్నాడు. 'నువ్వేం చేస్తున్నావు?' అని ప్రశ్నించాను. 'కాసేపే బాధ ఉంటుంది' అని చెప్పిన అతను ఆగలేదు. ఇలా చేయవద్దు అని నేను అరిచాను" అని పద్మా లక్ష్మి వెల్లడించింది.

 "నా కళ్ల వెంట నీరు కారుతున్నా వదల్లేదు. 'నువ్వు నిద్రపోతే బాధంతా పోతుంది' అంటూ... తరువాత నన్ను ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్లిపోయాడు. నేను ఏమని చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఈ ఘటనపై నేను పోలీసులకుగానీ, మా అమ్మకు గానీ చెప్పలేదు. నా తొలి అనుభూతి నాకు బాధనే మిగిల్చింది. జరిగినదాన్ని నేను అత్యాచారం అనిగానీ, సంభోగం అనిగానీ చెప్పను. కానీ నేను కన్యత్వాన్ని కోల్పోయాను. అంతకన్నా ఎన్నో ఏళ్ల ముందే... అంటే నాకు ఏడేళ్ల వయసున్నప్పుడే నా సవతి తండ్రి అసభ్యంగా తాకడం నాకింకా గుర్తుంది. నా చేతిని తీసుకుని అతని తొడల మధ్య పెట్టుకునేవాడు. ఈ విషయం గురించి అమ్మకు తెలిసిందో ఏమో, కొన్నేళ్ల పాటు నన్ను ఇండియాలోని తాతయ్య దగ్గరకు పంపించింది" అని చెప్పుకొచ్చింది.

లైంగిక వేధింపుల గురించి చెబితే, కష్టం ఇంకా పెరుగుతుందని, సూటిపోటి మాటలను ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతి ఒక్కరూ అదే దృష్టితో చూస్తుంటారని చెప్పిన పద్మా లక్ష్మి, ఆ కారణంతోనే బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. తాను ఇప్పుడు తన 8 సంవత్సరాల కుమార్తెకు ఓ స్నేహితురాలిగా అన్ని విషయాలనూ చెబుతున్నానని, ఆమెను ఫిజికల్ గా ఫిట్ గా ఉంచడమే తన లక్ష్యమని చెప్పారు.

More Telugu News