Maharashtra: అత్యాచారం కేసులో మైనర్ల సమ్మతిని అంగీకారంగా పరిగణించడం సాధ్యపడదు: మహారాష్ట్ర కోర్టు

  • 2015 అక్టోబరు 2న బాలికపై అత్యాచారం 
  • నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ జైలు శిక్ష, జరిమానా
  • నిందితుడు దురుద్దేశంతోనే బాధితురాలి ఇంట్లోకెళ్లాడన్న జడ్జి

దాదాపు మూడేళ్ల కిందట మహారాష్ట్రలోని పదహారేళ్ల బాలికపై ముప్పై ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన కేసులో తీర్పు వెలువడింది. నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ మహారాష్ట్ర కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, నిందితుడు బాధితురాలి ఇంట్లోకి దురుద్దేశంతో చొరబడినందుకుగాను మరో ఏడాది జైలు, పదిహేను వేల రూపాయల జరిమానా కూడా విధించింది.

మైనర్ బాలిక అత్యాచారం కేసులో బాలిక తెలిపే సమ్మతికి చట్టం దృష్టిలో విలువ లేదని ఈ సందర్భంగా థానే జిల్లా జడ్జి పీపీ జాదవ్ వ్యాఖ్యానించారు. బాధితురాలి వయసును పరిగణనలోకి తీసుకున్నప్పుడు, ఆమె అంగీకారాన్ని చట్టం దృష్టిలో అంగీకారంగా పరిగణించడం సాధ్యం కాదని పేర్కొన్నారు.

ఇక, ఈ కేసులో నిందితుడు దురుద్దేశంతోనే బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడని, ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని స్పష్టంగా తెలుస్తోందని న్యాయమూర్తి పీపీ జాదవ్ అన్నారు. కాగా, మహారాష్ట్రలోని థానేకు సమీపంలోని కాజువాడిలో 2015 అక్టోబరు 2న ఆ బాలికపై అత్యాచారం జరిగింది. అంతకుముందు కూడా ఆ బాలికతో నిందితుడు లైంగిక కార్యకలాపాలు సాగించాడు. 

More Telugu News