yogi adityanath: యూపీ ముఖ్యమంత్రికి షాక్.. నాటి హత్య కేసులో యోగికి నోటీసులు!

  • నోటీసులు జారీ చేసిన మహరాజ్ గంజ్ కోర్టు
  • 1999లో సత్య ప్రకాష్ హత్య
  • తిరిగి విచారించాలని సెషన్స్ కోర్టును ఆదేశించిన హైకోర్టు

ఓ హత్య కేసులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి కోర్టు నోటీసులివ్వడం సంచలనంగా మారింది. 1991లో జరిగిన ఓ హత్య కేసు పునర్విచారణలో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు మహరాజ్ గంజ్ కోర్టు ఈ నోటీసులిచ్చింది. సమాజ్ వాదీ పార్టీ నేత తలత్ అజీజ్ భద్రతాధికారి సత్య ప్రకాష్ యాదవ్ 1999లో మహరాజ్ గంజ్ జిల్లాలో ఓ ధర్నా సందర్భంగా జరిగిన కాల్పుల్లో హతులయ్యారు. ఈ కాల్పులు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోనే జరిగినట్టు అప్పట్లో కేసు నమోదైంది.

అయితే ఈ కేసుపై పునర్విచారణ నిర్వహించాలని కోరుతూ అజీజ్ దాఖలు చేసిన పిటిషన్‌ను 2018 మార్చిలో సెషన్స్ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అజీజ్ అలహాబాద్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణానంతరం హైకోర్టు ఈ కేసును తిరిగి విచారించాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది.

More Telugu News