dhoni: దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ కెప్టెన్సీ చేపట్టిన ధోనీ.. విధిరాత అన్న జార్ఖండ్ డైనమైట్!

  • కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతి
  • 696 రోజుల తర్వాత మళ్లీ కెప్టెన్ గా ధోనీ
  • టీమిండియా జట్టులో ఐదు మార్పులు

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ మళ్లీ జట్టు పగ్గాలను స్వీకరించాడు. 696 రోజుల తర్వాత మళ్లీ కెప్టెన్ గా బాధ్యతలను చేపట్టాడు. ఆసియా కప్ లో భాగంగా ఆఫ్ఘనిస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ నుంచి కెప్టెన్  రోహిత్ శర్మకు విశ్రాంతిని కల్పించడంతో... ధోనీ మరోసారి నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు. తద్వారా 200ల వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన ఘనతను సాధించాడు. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ, 200వ వన్డేకు కెప్టెన్ గా వ్యవహరించాలని రాసిపెట్టినట్టు ఉందని తెలిపాడు. మరోవైపు టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ ను ఎంచుకుంది.

టీమిండియా జట్టులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బౌలర్లు భువనేశ్వర్, బుమ్రా, చాహల్ లకు విశ్రాంతిని కల్పించారు. ఆప్ఘనిస్థాన్ జట్టులో రెండు మార్పులు జరిగాయి.

టీమిండియా జట్టు:
కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, కార్తీక్, ధోనీ, పాండే, జాధవ్, జడేజా, చాహర్, సిద్ధార్థ్ కౌల్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.

ఆఫ్ఘనిస్థాన్ జట్టు:
షహ్జాద్, జావెద్ అమ్మదీ, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది, అస్గర్ ఆఫ్ఘన్, నజీబుల్లా జడ్రాన్, ముహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, గుల్బదిన్ నయీబ్, ముజీబుర్ రెహ్మాన్, అఫ్తాబ్ ఆలం.

More Telugu News