lion: 13 సింహాల మృతి.. కారణం కనుగొనేందుకు రంగంలోకి 64 ప్రత్యేక బృందాలు

  • గుజరాత్ లోని గిర్ అడవుల్లో మృత్యువాత పడుతున్న సింహాలు
  • దర్యాప్తుకు ఆదేశించిన గుజరాత్ అటవీశాఖ మంత్రి
  • మరణాలకు గల కారణాలను అన్వేషిస్తున్న ప్రత్యేక బృందాలు

గుజరాత్ లోని గిర్ అడవుల్లోని సింహాలు ఒకదాని తర్వాత మరొకటి మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటి వరకు ఏకంగా 13 సింహాలు చనిపోవడంతో కలకలం రేగుతోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అలర్ట్ అయింది. భారీ సంఖ్యలో సింహాలు ఎందుకు మరణిస్తున్నాయో కారణాన్ని కనుగొనడానికి ఏకంగా 64 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ బృందాల్లోని నిపుణులంతా... గిర్ అడవులను శోధించి, ఈ మారణాలకు కారణాలను అన్వేషించనున్నారు.

మరోవైపు కాలేయ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్ మూలంగానే సింహాలు చనిపోతున్నాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. సింహాల వరుస మరణాలతో ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని గుజరాత్ అటవీశాఖ మంత్రి గణపత్ తెలిపారు. ఇలాంటి మరణాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ పరిమళ్ నాథ్వానీ డిమాండ్ చేశారు.

More Telugu News