nagarjuna: 'దేవదాస్' ప్రీ రిలీజ్ బిజినెస్... 37 కోట్లు!

  • శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా 'దేవదాస్'
  • సంగీత దర్శకుడిగా మణిశర్మ 
  • ఈ నెల 27వ తేదీన విడుదల

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున .. నాని కథానాయకులుగా 'దేవదాస్' సినిమా రూపొందింది. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. డాన్ గా నాగార్జున ..  డాక్టర్ గా నాని నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరిగిందని తెలుస్తోంది. ఆంధ్రాలో 14 కోట్లకు .. నైజామ్ లో 11 కోట్లకు .. సీడెడ్ లో 5 కోట్లకి .. ఓవర్సీస్ లో 4.50 కోట్లకు పంపిణీ హక్కులు అమ్ముడైనట్టుగా సమాచారం.

ఇలా తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ హక్కులు 30 కోట్లకి అమ్ముడుపోగా, ప్రపంచవ్యాప్తంగా 37 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా చెబుతున్నారు. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాలో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ .. నాని జోడీగా రష్మిక మందన నటించారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. నాగ్ .. నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.   

More Telugu News