araku: ఏజెన్సీలో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గలేదు: మాజీ డీజీపీ సాంబశివరావు

  • సానుభూతిపరులు లేకుండా ఉంటేనే ప్రాబల్యం తగ్గినట్టు
  • ఏదైనా జరిగితేనే ‘మావో’ల ప్రాబల్యమున్నట్టు కాదు
  • సానుభూతిపరులు జనజీవనంలో కలిసిపోయేలా చేయాలి 

అరకులో మావోయిస్టుల దాడి చాలా దురదృష్టకరమైన సంఘటన అని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ఏపీ మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎన్ కౌంటర్ జరిగినప్పుడో లేదా కూంబింగ్ జరిగినప్పుడో అక్కడ మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని సహజంగా అందరూ భావిస్తుంటారని అన్నారు.

 తమకు ఉన్న అనుభవం ప్రకారం చెప్పాలంటే, ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల సానుభూతిపరులు కూడా ఉండకుండా ఉంటేనే ఫలానా ప్రాంతం సేఫ్ గా ఉందని చెప్పుకోవచ్చని అన్నారు. సానుభూతిపరులు లేదా వారి కేడర్ ఉంటే ఎవరిపైన అయినా దాడి చేయడానికి మావోయిస్టులకు సపోర్టు దొరుకుతుందని, ఎప్పుడైతే క్షేత్ర స్థాయిలో మావోయిస్టులకు సపోర్టు దొరుకుతుందో.. అప్పుడు వారి ప్రాబల్యం ఉన్నట్టే లెక్క అని చెప్పారు. అంతేగానీ, ఏదైనా సంఘటన జరిగితేనే మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నట్టు కాదని అన్నారు. అందుకని, క్షేత్రస్థాయిలో కూడా వారికి సానుభూతిపరులు లేకుండా చేయాలని, సానుభూతిపరులను మన వైపు తిప్పుకోవడమో లేకపోతే జనజీవన విధానంలోకలిసిపోయేలా చేయడమో చాలా ముఖ్యమని సూచించారు.

More Telugu News