sikkim: సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ

  • గ్యాంగ్ టక్ కు 33 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్ట్
  • 201ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం
  • అక్టోబర్ 4 నుంచి సర్వీసులు ప్రారంభం

సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ విమానాశ్రయం గ్యాంగ్ టక్ కు 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2009లోనే ఈ ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన జరిగింది. తొమ్మిదేళ్ల అనంతరం ఇది ఈరోజు అందుబాటులోకి వచ్చింది. రూ. 605 కోట్ల ఖర్చుతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది. పోక్యంగ్ గ్రామాన్ని ఆనుకుని ఉన్న 2 కిలోమీటర్ల ఎత్తైన పర్వతంపై దీన్ని నిర్మించారు. సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో 201 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం ఉంది. అక్టోబర్ 4వ తేదీన ఇక్కడి నుంచి ఢిల్లీ, కోల్ కతా, గౌహతిలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

More Telugu News