ananth sriram: రాజమౌళి అలా ఆలోచిస్తారు .. అదే ఆయన గొప్పతనం: అనంత్ శ్రీరామ్

  • రాజమౌళి గారు తగిన సమయాన్ని ఇస్తారు 
  • వెంటనే కావాలని తొందర పెట్టరు
  • పాట రెడీ అయ్యాకే షూటింగు పెడతారు

పాటల రచయితగా ఎంతోమంది దర్శకులతో కలిసి అనంత్ శ్రీరామ్ పనిచేశాడు. తాజాగా ఆయన 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో మాట్లాడుతూ, రాజమౌళిని గురించి ప్రస్తావించాడు. "రాజమౌళి - కీరవాణిగార్లతో కలిసి పనిచేయడం చాలా సవాలుగా .. సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. రాజమౌళిగారు ఒక పాట ఇచ్చారంటే .. ఆ పాట రాయడానికి తగిన సమయాన్ని ఇస్తారు.

పాట పూర్తయిన తరువాతనే షూటింగుకి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు గానీ, షూటింగ్ ఫలానా రోజున పెట్టేసుకున్నామని చెప్పేసి తొందరపెట్టరు. పాట తాను అనుకున్నట్టుగా వచ్చేవరకూ ఆయన చాలా ఓపికగా వేచి చూస్తారు. ఈ రచయిత దగ్గర ఆలస్యమవుతుందేమో .. ఆయనని అలా రాయనిద్దాం .. ఆయనకి తెలియకుండగా మరో రచయితకి కూడా ఇద్దాం అనుకునేవారు కాదు. ఈ పాటను ఈ రచయితతో రాయించుకుందాం అని ఆయన ఒకసారి అనుకుంటే, ఎంతకాలమైనా అదే రచయిత ఆ పాటను రాస్తాడు. రచయితకి అంతటి అవకాశం .. సమయం ఇవ్వడమే రాజమౌళిగారిలోని గొప్పతనం" అని చెప్పుకొచ్చాడు.   

More Telugu News