krishnachaithanya: తెరపైకి ఘంటసాల బయోపిక్?

  • ఆరంభంలో ఎన్నో కష్టాలు 
  • ఆ తరువాత అనూహ్యమైన ఆదరణ 
  • సంగీత దర్శకుడిగాను సక్సెస్   

భక్తి గీతాలను .. యుగళ గీతాలను .. విషాద గీతాలను .. ఇలా అన్ని రకాల పాటలను ఘంటసాల వెంకటేశ్వరరావు తన స్వరంలో అద్భుతంగా పలికించారు. అగ్రస్థాయి హీరోలకే కాదు .. ఆనాటి కమెడియన్స్ కి కూడా ఆయన పాటలు పాడారు. గాయకుడిగానే కాదు .. సంగీత దర్శకుడిగా కూడా ఆయన సక్సెస్ ను సాధించారు.

కెరియర్ ఆరంభంలో ఘంటసాల ఎన్నో కష్టాలు పడ్డారు. విజయనగరంలో సంగీత సాధన చేసే రోజుల్లో మధూకరం చేసి (జోలె పట్టి ఇంటింటికీ తిరిగి ఆహారాన్ని తెచ్చుకోవడం) పొట్ట పోషించుకున్నారు. అలాంటి ఘంటసాల జీవితచరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఘంటసాల జీవితచరిత్రపై పరిశోధన చేసిన సీహెచ్ రామారావు, ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది. ఘంటసాల పాత్రను సింగర్ కృష్ణ చైతన్య పోషించనున్నాడని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.   

More Telugu News