badminton: బాడ్మింటన్ ప్రియులకు షాక్.. లీ చాంగ్ వీకి కేన్సర్!

  • ముక్కుకు తొలిదశ కేన్సర్ సోకినట్లు వెల్లడి
  • తైవాన్ లో చికిత్స పొందుతున్నారన్న బామ్ చీఫ్
  • 3 నెలలుగా ఆటకు దూరంగా లీ చాంగ్ వీ

బాడ్మింటన్ ప్రియులకు షాకింగ్ వార్త. ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్, మలేసియా ఆటగాడు లీ చాంగ్ వీ(35)కి కేన్సర్ సోకినట్లు తేలింది. చాంగ్ వీకి ప్రస్తుతం ముక్కు కేన్సర్ తొలి దశలో ఉందని మలేసియా బాడ్మింటన్ సంఘం(బామ్) తెలిపింది. చాంగ్ వీ ప్రస్తుతం తైవాన్ లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. అతనికి ప్రపంచస్థాయి వైద్యులు చికిత్స చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ ఏడాది జులైలో చాంగ్ వీ శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. దీంతో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా, ముక్కులో కేన్సర్ వచ్చినట్లు తేలింది. ప్రస్తుతం కేన్సర్ తొలిదశలోనే ఉండటంతో ప్రమాదమేమి లేదని బామ్ అధ్యక్షుడు డాటక్ సెరినోర్జా జకారియా తెలిపారు. చాంగ్ వీ కామన్ వెల్త్ గేమ్స్ లో ఐదు స్వర్ణ పతకాలు, ఆసియన్ గేమ్స్ లో రెండు స్వర్ణ పతకాలు, ఒలింపిక్స్ లో మూడు రజత పతకాలు గెలుచుకున్నాడు. గత మూడు నెలలుగా చాంగ్ వీ ఆటకు దూరంగా ఉన్నాడు.

More Telugu News