ఉదయం 8 గంటలకే ఖైరతాబాద్ దాటేసిన బడా గణేష్!

23-09-2018 Sun 08:38
  • గత రాత్రి నుంచే నిమజ్జనం పనులు
  • 6 గంటలకల్లా మెదలైన శోభాయాత్ర
  • ప్రస్తుతం లక్డీకపూల్ వద్ద గణేశుడు
ఖైరాతాబాద్ లో కొలువుదిరిన సప్తముఖ కాళసర్ప మహాగణపతి శోభాయాత్ర శరవేగంగా సాగుతోంది. గత రాత్రి నుంచే నిమజ్జనం పనులు ప్రారంభం కాగా, ఈ ఉదయం 6 గంటలలోపే నిమజ్జన యాత్ర మొదలై, ఇప్పుడు ఖైరతాబాద్ దాటింది. విగ్రహాన్ని నిలిపిన ఖైరతాబాద్ లైబ్రరీ ప్రాంతం నుంచి నెమ్మదిగా కదిలిన గణనాధుడు, ప్రస్తుతం లక్డీకపూల్ చౌరస్తాకు చేరాడు. నాంపల్లి మీదుగా ట్యాంక్ బండ్ పైకి వస్తున్న విగ్రహాలతో, రవీంద్రభారతి నుంచి సెక్రటేరిటేట్ కు దారితీసే మార్గంలో విగ్రహాలు అధికంగా ఉండటంతో ఖైరతాబాద్ గణేశుడి యాత్రకు ఆలస్యం అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట మధ్య నిమజ్జనం పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు.