Tirumala: తిరుమలలో భక్తజనం... 'వైకుంఠం' దాటి వెలుపల 3 కిలోమీటర్ల వరకూ భక్తులు!

  • కిక్కిరిసిన ఏడుకొండలు
  • తిరుమలలో పెరటాసి మాసం
  • భక్తుల మధ్య స్వల్ప తోపులాటలో వృద్ధురాలికి అస్వస్థత

బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత, తొలి వారాంతంలోనే తిరుమలకు భక్తులు పోటెత్తారు. పెరటాసి మాసం (తిరుమల శనివారాల నెల) ప్రారంభం కావడం, వారాంతం, వరుస సెలవుల కారణంగా ఏడుకొండలు కిక్కిరిశాయి. బస్సులు తదితర వాహనాల్లో చేరుకున్న వారితో పాటు, కాలినడకన వచ్చిన వారు సర్వదర్శనం క్యూలైన్ లోకి ప్రవేశించడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండి, బయటకు 3 కిలోమీటర్ల మేరకు భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలోకి ప్రవేశించేందుకు భక్తులు పోటీ పడటంతో ఓ భక్తురాలు అస్వస్థతకు గురైంది. తోపులాటను క్రమబద్ధీకరించేందుకు యత్నించిన రోప్ పార్టీ సైతం విఫలమైంది. రద్దీని ముందుగానే ఊహించిన అధికారులు, దివ్యదర్శన టోకెన్లను నిలిపివేశారు. సర్వదర్శన టోకెన్లను 18 వేలకు తగ్గించారు. నిన్న తిరుమలలో 'బాగ్ సవారీ' ఉత్సవం వైభవంగా జరిగింది.

More Telugu News