kalyan ram: యాక్షన్ సీన్స్ తో బిజీగా నందమూరి హీరో

  • గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్
  • కథానాయికలుగా నివేదా .. షాలినీ పాండే 
  • సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర   

ఒక వైపున నటుడిగాను .. మరో వైపున నిర్మాతగాను కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ కల్యాణ్ రామ్ ముందుకుసాగుతున్నాడు. ఈ మధ్య ఆయన చేసిన 'ఎమ్మెల్యే' .. 'నా నువ్వే ' సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. దాంతో ఈసారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. ప్రస్తుతం ఆయన తన కెరియర్లో 16వ సినిమాను చేస్తున్నాడు.

గుహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను నిర్ణయించలేదు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. కల్యాణ్ రామ్ .. కొందరు ఫైటర్స్ కాంబినేషన్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన నివేదా థామస్ .. షాలిని పాండే నటిస్తున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.  

More Telugu News