Tech-News: ఆకట్టుకునే ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన శాంసంగ్!

  • శాంసంగ్ నుండి గెలాక్సీ జే4ప్లస్, గెలాక్సీ జే6ప్లస్ విడుదల 
  • గెలాక్సీ జే4ప్లస్ ఫోన్ ధర రూ.10,990
  • గెలాక్సీ జే6ప్లస్ ఫోన్ ధర రూ.15,990

శాంసంగ్ సంస్థ నుండి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి. 6 అంగుళాల తెర, ఒకే బ్యాటరీ కెపాసిటీతో శాంసంగ్ గెలాక్సీ జే4ప్లస్, శాంసంగ్ గెలాక్సీ జే6ప్లస్ పేరిట నూతన స్మార్ట్ ఫోన్లు తాజాగా భారత మార్కెట్లోకి వచ్చేశాయి. ఈ నెల 25 నుండి ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. బ్లాక్, బ్లూ, గోల్డ్ రంగులలో లభించే గెలాక్సీ జే4ప్లస్ ఫోన్ ధర రూ.10,990 ఉండగా.. బ్లాక్, బ్లూ, రెడ్ కలర్ లలో లభించే గెలాక్సీ జే6ప్లస్ ఫోన్ ధర రూ.15,990గా నిర్ణయించారు.

శాంసంగ్ గెలాక్సీ జే4ప్లస్ ప్రత్యేకతలు:

  • 6" ఇన్ఫినిటీ డిస్‌ప్లే (720x1480 పిక్సల్స్)
  • స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్‌
  • వెనక భాగంలో 13 మెగాపిక్స‌ల్ కెమెరా
  • ముందు భాగంలో 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 3,300ఎంఏహెచ్ బ్యాట‌రీ

శాంసంగ్ గెలాక్సీ జే6ప్లస్ ప్రత్యేకతలు:

  • 6" ఇన్ఫినిటీ డిస్‌ప్లే (720x1480 పిక్సల్స్)
  • స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్‌
  • వెనక భాగంలో రెండు 13/5 మెగాపిక్స‌ల్ కెమెరాలు
  • ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 3,300ఎంఏహెచ్ బ్యాట‌రీ 

More Telugu News