samanta: 'స్త్రీ' మూవీ తెలుగు రీమేక్ .. తెరపైకి సమంత - నిహారిక పేర్లు!

  • హిందీలో హిట్ కొట్టేసిన 'స్త్రీ' 
  • శ్రద్ధా కపూర్ కి మంచి పేరు 
  • ఆలోచనలో పడిన సమంత

హిందీలో ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ మూవీస్ లో 'స్త్రీ' ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. శ్రద్ధా కపూర్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్ .. రాజ్ కుమార్ రావు నటించిన ఈ సినిమా, ఆగస్టు 31వ తేదీన విడుదలై 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా నిర్మాతలు రాజ్ నిడిమోరు .. కృష్ణ డీకే తెలుగువారే.15 కోట్లతో నిర్మించిన 'స్త్రీ' భారీస్థాయిలో లాభాలను తెచ్చిపెట్టడంతో, తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమా కథను సమంతకు .. నిహారికకు వినిపించారట. 'యూటర్న్' ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టకపోవడంతో సమంత ఆలోచన చేస్తోందట. ఒకవేళ ఆమె చేయనంటే నిహారికతో చేయాలనే ఆలోచనలో నిర్మాతలు వున్నట్టుగా సమాచారం.   

More Telugu News