vijay devarakonda: 'నోటా' రిలీజ్ డేట్ ఖరారైపోయింది

  • విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'నోటా'
  • తెలుగు .. తమిళ భాషల్లో ఒకే రోజున రిలీజ్ 
  • ముఖ్య పాత్రల్లో సత్యరాజ్ .. నాజర్

విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'నోటా' రెడీ అవుతోంది. అక్టోబర్ 4వ తేదీన ఈ సినిమా విడుదలవుతుందనే వార్తలు కొన్ని రోజుల క్రితం వచ్చాయి. ఆ తరువాత ఒక వివాదం కారణంగా ఈ సినిమా థియేటర్లకు రావడానికి ఇంకా సమయం పట్టొచ్చనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేసి .. తాజాగా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో తొలిసారిగా విజయ్ దేవరకొండ తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా కనిపించనుండగా, సత్యరాజ్ .. నాజర్ కీలకమైన పాత్రలను పోషించారు. 

More Telugu News