venkatesh: వెంకటేశ్ కూతురు వివాహానికి సన్నాహాలు

  • వెంకటేశ్ కూతురు ఆశ్రిత 
  • బేకరీ బిజినెస్ లో బిజీ 
  • త్వరలో పెళ్లి మంటపం దిశగా అడుగులు

త్వరలో వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి కనిపించనుందని తెలుస్తోంది. ఆయన కూతురు 'ఆశ్రిత' వివాహానికి సన్నాహాలు మొదలుకానున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆశ్రిత ఫారిన్ లో బేకరీ రంగంలో శిక్షణ తీసుకుంది. 'ఇన్ఫినిటీ ప్లేటర్' పేరుతో సిటీలో పలు స్టాల్స్ ను ఆమె నిర్వహిస్తోంది.

హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు (మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడు రఘురామిరెడ్డి కొడుకు)తో ఆశ్రిత వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అబ్బాయి తరఫు పెద్దవాళ్లతో సురేశ్ బాబు మాట్లాడారట. ప్రస్తుతం వెంకటేశ్ 'ఎఫ్ 2' సినిమా షూటింగు కోసం విదేశాల్లో వున్నారు. ఆయన అక్కడి నుంచి తిరిగిరాగానే కూతురు నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నట్టు చెప్పుకుంటున్నారు. వచ్చే ఏడాది మార్చిలో పెళ్లి జరగవచ్చనే టాక్ వినిపిస్తోంది.  

More Telugu News