aravind swami: దుమ్మురేపేస్తోన్న 'నవాబ్' ట్రైలర్

  • నలుగురు హీరోలుగా 'నవాబ్'
  • యాక్షన్ కి .. ఎమోషన్ కి పెద్దపీట 
  • ఈ నెల 27వ తేదీన భారీ రిలీజ్

మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో 'చక్క చివంత వానమ్' సినిమా రూపొందింది. మద్రాస్ టాకీస్ .. లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 27వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. 'నవాబ్' టైటిల్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

అరవింద్ స్వామి .. అరుణ్ విజయ్ .. శింబు .. విజయ్ సేతుపతి .. జ్యోతిక .. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నలుగురు కథానాయకులు కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. సహజత్వానికి దగ్గరగా మలచిన సన్నివేశాలు మనసుకు పట్టుకునేలా వున్నాయి. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More Telugu News