sampoornesh babu: మళ్లీ సంపూర్ణేశ్ బాబు సందడి .. 'కొబ్బరిమట్ట' సాంగ్ ప్రోమో రిలీజ్

  • సంపూర్ణేశ్ బాబు హీరోగా 'కొబ్బరిమట్ట'
  • అన్నదమ్ముల అనుబంధమే నేపథ్యం 
  • నవంబర్ 14వ తేదీన విడుదల

హాస్య కథానాయకుడిగా సంపూర్ణేశ్ బాబుకి యూత్ లో మంచి క్రేజ్ వుంది. కొన్ని హిట్ సినిమాల్లోని హైలైట్ సీన్స్ కి పేరడీలు ఆయన సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా 'కొబ్బరిమట్ట' సినిమా రూపొందింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఆలస్యంగా థియేటర్లకు వస్తోంది.

నవంబర్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ ను వదిలారు. అయిదుగురు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ అనుబంధాన్ని ప్రోమో సాంగ్ లో చూపించిన తీరు సరదాగా వుంది. కొంతకాలంగా తన జోరు తగ్గించిన సంపూర్ణేశ్ బాబు, ఈ సినిమాతో మళ్లీ స్పీడ్ పెంచుతాడేమో చూడాలి.


More Telugu News