priya prakash: మరో సాంగ్ తో యూత్ ను పలకరిస్తోన్న ప్రియా వారియర్

  • యూత్ మనసులు దోచేసిన ప్రియా ప్రకాశ్ 
  • 'ఒరు ఆదార్ లవ్' నుంచి మరో లవ్ సాంగ్ 
  • అభిమానుల్లో ఒకింత అసంతృప్తి  

ప్రియా ప్రకాశ్ వారియర్ పేరు వినగానే, కొన్ని నెలల క్రితం ఓ సినిమా పాటలో చిలిపిగా కన్ను గీటుతూ కుర్రకారుకు కుదురులేకుండగా చేసిన కొంటె పిల్ల గుర్తుకువస్తుంది. ప్రియా ప్రకాశ్ వారియర్ కి విపరీతమైన క్రేజ్ ను తీసుకొచ్చేసిన ఆ పాట 'ఒరు ఆదార్ లవ్' అనే మలయాళం సినిమాలోనిది. ఆ సినిమాలో నుంచి మరో ఉత్సాహభరితమైన లవ్ సాంగ్ ను నిన్ననే యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.

వయ్యారాలుపోయే నడకతో .. సింపుల్ గా అనిపించే స్టెప్పులతో ఈ అమ్మాయి అదరగొట్టేసింది. ఈ సాంగ్ ఇలా యూట్యూబ్ లో విడుదలైందో లేదో అలా మిలియన్ల కొద్దీ వ్యూస్ ను రాబట్టేస్తోంది. అయితే ఈ పాటలో ప్రియా వారియర్ అభిమానులు ఆశించేస్థాయిలో గ్లామరస్ గా కనిపించకపోవడం వాళ్లకి అసంతృప్తిని కలిగిస్తోన్న విషయం. అందువలన ఆమె లుక్స్ గురించిన కామెంట్స్ తో డిస్ లైకులు కూడా పెద్ద సంఖ్యలోనే పడుతున్నాయి.

More Telugu News