tamannah: తమన్నా హారర్ మూవీకి సీక్వెల్

  • హారర్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన 'అభినేత్రి'
  • సీక్వెల్ దిశగా దర్శకుడి ప్రయత్నాలు
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా - ప్రభుదేవా

తమన్నా కథానాయికగా తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో రెండు సంవత్సరాల క్రితం ఒక హారర్ మూవీ వచ్చింది. ఒక్కో భాషల్లో ఒక్కో టైటిల్ తో ఆ సినిమాను విడుదల చేశారు. తమిళంలో ఫరవాలేదు అనిపించుకున్న ఆ సినిమా, తెలుగులో 'అభినేత్రి' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు .. హిందీ భాషల్లో ఓ మాదిరిగా ఆడింది.

ప్రభుదేవా .. సోనూ సూద్ కీలకమైన పాత్రలను పోషించిన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు ఏఎల్. విజయ్ ఈ సినిమా సీక్వెల్ కి కథను రెడీ చేసి ప్రభుదేవా - తమన్నాలకు వినిపించడం, వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాకి 'అభినేత్రి 2' అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. అంతగా ఆడని ఈ సినిమాకి సీక్వెల్ ఏంటబ్బా అనే టాక్ ఫిల్మ్ నగర్లో ఎక్కువగా వినిపిస్తోంది.    

More Telugu News