sensex: భారీ నష్టాల్లో షేర్ మార్కెట్.. తీవ్ర ఒత్తిడికి గురైన ఫైనాన్స్, బ్యాంకింగ్ సెక్టార్!

  • తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న మార్కెట్లు 
  • ఒకానొక సమయంలో 1100లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్
  • 42 శాతంపైగా నష్టపోయిన దేవాన్ హౌసింగ్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హౌసింగ్ ఫైనాన్స్, ప్రాపర్టీ, బ్యాంకింగ్ స్టాకులు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1100 పాయింట్ల కంటే ఎక్కువగా పతనమైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఆ తర్వాత కాస్త పుంజుకున్నప్పటికీ, చివరకు నష్టాల్లోనే మార్కెట్లు ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 280 పాయింట్లు కోల్పోయి 36,841కు పడిపోయింది. నిఫ్టీ 91 పాయింట్లు పతనమై 11,143కు దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఆయిల్ ఇండియా లిమిటెడ్ (5.24%), ఫీనిక్స్ మిల్స్ (4.99%), వా టెక్ వాబాగ్ లిమిటెడ్ (4.51%), రాజేష్ ఎక్స్ పోర్ట్స్ (4.25%), జస్ట్ డయల్ (4.07%).

టాప్ లూజర్స్:
దేవాన్ హౌసింగ్ (-42.43%), ఎస్ బ్యాంక్ (-28.71%), ఇన్ఫిబీమ్ అవెన్యూస్ (-22.76%), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-19.95%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్స్ (-15.93%).      

More Telugu News