కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసులు!

21-09-2018 Fri 16:01
  • కుంతియాపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలపై స్పందన
  • రాజగోపాల్ రెడ్డి రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలి
  • క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ కుంతియాపై ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, రెండు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో క్రమశిక్షణా కమిటీ పేర్కొంది. కాగా, రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈరోజు ఉదయం క్రమశిక్షణా సంఘం చర్చించింది. ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించొద్దని పార్టీ నిర్ణయించినట్టు సమాచారం.