Chandrababu: చంద్రబాబు సీఎం అయినా కోర్టుకు రావాల్సిందే!: ధర్మాబాద్ కోర్టు స్పష్టీకరణ

  • చట్టానికి ఎవరూ మినహాయింపు కాదు
  • సీఎం అయినా కోర్టు ఆదేశాలను పాటించాల్సిందే
  • తదుపరి విచారణకు అందరూ కోర్టుకు హాజరుకావాలి

బాబ్లీ ప్రాజెక్టు కేసు విషయంలో ధర్మాబాద్ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున లాయర్ సుబ్బారావు వేసిన అరెస్ట్ వారెంట్ రీకాల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. చంద్రబాబు సహా నోటీసులు అందుకున్న వారంతా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 15వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కేఎస్ రత్నం, ప్రకాష్ గౌడ్ లపై అరెస్ట్ వారెంట్ ను రద్దు చేసి, బెయిల్ మంజూరు చేసింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ, చట్టానికి ఎవరూ మినహాయింపు కాదని చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, సామాన్యులైనా కోర్టు ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఎవరికీ కోర్టు నుంచి మినహాయింపులు ఉండవని చెప్పారు. తదుపరి విచారణకు కేసులో ఉన్న వారందరూ హాజరు కావాల్సిందేనని ఆదేశించారు.

More Telugu News