Kerala: ప్రకోపించిన కామం... నడివీధిలో అమ్మాయిలను అసభ్యంగా తాకే హోమ్ గార్డు... వీడియో వైరల్!

  • నడిరోడ్డుపై బాలికలను అసభ్యంగా తాకిన హోమ్ గార్డు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
  • కొచ్చిలో ఘటన... సీరియస్ అయిన పోలీస్ కమిషనర్

బాధ్యతాయుతమైన పోలీసు వ్యవస్థలో భాగంగా ఉండి, మహిళలకు, విద్యార్థినులకు రక్షణ కల్పించాల్సిన ఓ హోమ్ గార్డు, విధులు నిర్వహిస్తూ, తనలోని కామ ప్రకోపాన్ని చూపించాడు. కొచ్చిలోని తివారాలో ఓ చర్చి ముందు విధులు నిర్వహిస్తున్న శివకుమార్‌ అనే హోమ్ గార్డు, అటుగా వెళుతున్న మహిళలు, బాలికలను అసభ్యంగా తాకుతూ వేధించగా, అక్కడున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో దీన్ని తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి రాగా, సదరు హోమ్ గార్డు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎలమక్కరాకు చెందిన శివకుమార్ వయసు 58 సంవత్సరాలు కాగా, తన మనవరాళ్ల వయసులో ఉండి, పాఠశాలలకు వెళుతున్న విద్యార్థినులను కూడా వదల్లేదు. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో, సీటి పోలీస్‌ కమిషనర్‌ సీరియస్‌ అయ్యారు. శివకుమార్‌ను విధుల నుంచి తొలగించడంతో పాటు, ఐపీసీ 354, పోక్సో చట్టంలోని 7, 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారు.

More Telugu News