OLX: 'ఓఎల్ఎక్స్' వేదికగా మోసాలు.. సంస్థ చైర్మన్ కు విశాఖ సైబర్ పోలీసుల నోటీసులు!

  • ఓఎల్ఎక్స్ వేదికగా పెరుగుతున్న మోసాలు
  • సగటున రోజుకు రెండు ఫిర్యాదులు
  • విశాఖకు రానున్న ఓఎల్ఎక్స్ చైర్మన్

సెకండ్ హ్యాండ్ వస్తువుల కొనుగోలు, అమ్మకాల మాధ్యమ సేవలందిస్తున్న ఓఎల్ఎక్స్ వేదికగా జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయడంపై విశాఖ పోలీసులు దృష్టిసారించారు. కొంతమంది తమ పాత వస్తువులను విక్రయిస్తామని పేర్కొంటూ, వెబ్‌ సైట్‌ లో ప్రకటనలు ఇచ్చి, అవతలి వారిని మోసం చేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో, ఓఎల్ఎక్స్ చైర్మన్ కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేసి, విచారణకు రావాలని ఆదేశించారు.

 సగటున రోజుకు ఈ తరహా కేసుల్లో రెండు ఫిర్యాదులు వస్తుండటంతో, వెబ్‌ సైట్‌ నిర్వాహకులను పిలిచి మాట్లాడాలని భావించిన, సైబర్‌ క్రైమ్‌ ఉన్నతాధికారులు, ఇటీవల ఢిల్లీ వెళ్లి విశాఖలో జరిగే విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ, ఓఎల్‌ఎక్స్‌ చైర్మన్‌ కు నోటీసులు ఇచ్చారు. ఆయన నేడు లేదా రేపు విశాఖకు వచ్చి, పోలీసుల విచారణకు హాజరుకానున్నట్లు సమాచారం.

More Telugu News