High School: క్లాసు రూములో బాలబాలికల రొమాన్స్.. ఏమిటీ వైపరీత్యం?: వైరల్ అవుతున్న వీడియో

  • హైస్కూల్ వయసులోనే ప్రేమలు
  • ఆకర్షణనే ప్రేమనుకుంటున్న బాలబాలికలు
  • క్లాస్ రూములో నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు

హైస్కూల్ వయసులోనే ప్రేమ... ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న మాటిది. తెలిసీ తెలియని వయసులో ఆకర్షణలో పడి, దాన్నే ప్రేమగా భావిస్తూ, తల్లిదండ్రులకు దూరమవుతున్న అమ్మాయిలు, అబ్బాయిల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ సమయంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

 ఓ పాఠశాలలో బహుశా 9 లేదా 10వ తరగతి క్లాస్ కావచ్చది. అమ్మాయిలు, అబ్బాయిలు జంటగా చేరి అత్యంత జుగుప్సాకరంగా, నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు. ఒకరిని ఒకరు ముద్దులు పెట్టుకుంటున్నారు. తోటి విద్యార్థినీ విద్యార్థులు చూస్తున్నారని, వచ్చిపోతున్నారన్న భావన వారిలో కనిపించడం లేదు. ఈ స్కూల్ ఎక్కడ ఉందో, ఈ వీడియోను ఎప్పుడు తీశారో తెలియదుగానీ, హైస్కూల్ ప్రేమలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. "ఇది తరగతి గదేనా లేక రొమాన్స్ గదా?" అంటూ దీన్ని చూసిన వారు తీవ్రంగా మండిపడుతున్నారు.

More Telugu News