Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • జయం రవి సరసన కాజల్ అగర్వాల్ 
  • 'ద ఐరన్ లేడి'గా జయలలిత బయోపిక్ 
  • 'అరవింద సమేత' ప్రీ రిలీజ్ వేడుక 

*  తెలుగులో యంగ్ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, శర్వానంద్ లతో రెండు సినిమాలు చేస్తున్న కథానాయిక కాజల్ అగర్వాల్ తాజాగా తమిళంలో కూడా ఓ యంగ్ హీరోతో చేయడానికి ఓకే చెప్పింది. జయం రవి హీరోగా నూతన దర్శకుడు ప్రదీప్ రూపొందించే చిత్రంలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారట.
*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా రూపొందే చిత్రానికి 'ద ఐరన్ లేడి' అనే టైటిల్ని ఖరారు చేశారు. ఎ. ప్రియదర్శిని దర్శకత్వం వహించే ఈ చిత్రం టైటిల్ లోగోను నిన్న విడుదల చేశారు. నిత్యా మీనన్ కానీ, వరలక్ష్మి కానీ ఇందులో టైటిల్ పాత్రను పోషిస్తారని తెలుస్తోంది.
*  ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న 'అరవింద సమేత' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను అక్టోబర్ ఒకటిన కానీ, రెండున కానీ నిర్వహించనున్నారు. విజయదశమికి విడుదల అయ్యే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. 

More Telugu News