‘తెలంగాణ’కు కుంతియా శనిలా తయారయ్యారు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

20-09-2018 Thu 19:19
  • కమిటీలో మమ్మల్ని ఎక్కడో కిందపడేశారు
  • పైరవీకారులకు టిక్కెట్లిస్తే కాంగ్రెస్ గెలవదు
  • తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్ గతంలో ఓడిపోయింది
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్రోకర్లందరికీ కమిటీలో స్థానం కల్పించారని, గాంధీ భవన్ లో ప్రెస్ మీట్లు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని విమర్శించారు.

‘‘తెలంగాణ’కు కుంతియా శనిలా తయారయ్యాడు. నేను ఎవరికీ భయపడను, తలవంచను. పైరవీకారులకు టిక్కెట్లిస్తే కాంగ్రెస్ గెలవదు. కమిటీలో మమ్మల్ని ఎక్కడో కిందపడేశారు. వార్డు మెంబర్ గా గెలవలేని వారికి కమిటీలో స్థానం కల్పించారు. తప్పుడు నిర్ణయాలతోనే కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఓడిపోయింది. రెండున్నర సంవత్సరాలలో పార్టీ మమ్మల్ని వందసార్లు అవమానించింది. ప్రజల్లో బలంగా ఉన్న వారికి అన్యాయం జరిగింది’ అని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.