Ramnath kovind: కోహ్లీకి ‘రాజీవ్ ఖేల్ రత్న’ను ప్రకటించిన కేంద్ర క్రీడాశాఖ

  • కోహ్లీని వరించిన అత్యున్నత పురస్కారం
  • నీరజ్ చోప్రా, హిమాదాస్, స్మృతి మంధానకు ‘అర్జున’
  • ఈనెల 25న అందజేయనున్న రాష్ట్రపతి

2018కి గాను క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా శాఖ గురువారం ప్రకటించింది. ఈ రంగంలో అత్యున్నత పురస్కారం టీమిండియా సారథి విరాట్ కోహ్లీని వరించింది. విరాట్‌తో పాటు వెయిట్ లిఫ్టర్ మీరా బాయి ఛాను రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకోబోతున్నారు. అథ్లెట్స్ నీరజ్ చోప్రా, హిమాదాస్, మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అర్జున పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.

ఈ ఏడాది నలుగురికి థ్యాన్‌చంద్, ఎనిమిది మందికి ద్రోణాచార్య, 20 మందికి అర్జున పురస్కారాలను క్రీడాశాఖ ప్రకటించింది. ఖేల్ రత్న గ్రహీతలకు రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్య, థ్యాన్ చంద్ అవార్డు గ్రహీతలకు రూ.5 లక్షల చొప్పున నగదు బహుమతిని అందజేస్తారు. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ పురస్కారాలను అందజేయనున్నారు. 

More Telugu News