sadak movie: ‘సడక్‌-2’ టీజర్ ను రిలీజ్ చేసిన ఆలియా

  • 27 ఏళ్ల తర్వాత తెరకెక్కనున్న ‘సడక్’కు సీక్వెల్  
  • మహేష్ భట్  జన్మదినం సందర్భంగా టీజర్
  • 2020, మార్చి 25న ప్రేక్షకుల ముందుకు సీక్వెల్

బాలీవుడ్ సినిమా సడక్ గుర్తుందా? 1991లో బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సంజయ్ దత్, పూజా భట్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని పూజా తండ్రి మహేష్ భట్ నిర్మించారు. వ్యభిచార గృహంలో పనిచేస్తున్న పూజకు రవి అనే ట్యాక్సీ డ్రైవర్‌తో పరిచయం.. ప్రేమ.. అనంతరం ఆమెను రవి వ్యభిచార గృహం నుంచి తప్పించి తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. 27 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తోంది చిత్రబృందం. మరి అదే కథను కొనసాగిస్తారా? లేదంటే కొత్త కథను ఎంచుకుంటారా? అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ‘సడక్-2’ అని టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఆలియా, సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్, పూజాభట్ నటించనున్నారు. నేడు(గురువారం) మహేష్ భట్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆలియా తన ఇన్‌స్టాగ్రాం ద్వారా టీజర్‌ను విడుదల చేసింది. టీజర్‌లో ‘సడక్’లోని కొన్ని సన్నివేశాలను చూపించారు. ఈ చిత్రం 2020, మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News