karthikeya: 'ఆర్ ఎక్స్ 100' హీరోతో కొత్త చిత్రం

  • 'ఆర్ ఎక్స్ 100' సూపర్ హిట్ 
  • నెక్స్ట్ మూవీగా 'హిప్పీ'
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్

ఇటీవల కాలంలో యూత్ మనసులను ఎక్కువగా కొల్లగొట్టేసిన చిత్రం 'ఆర్ ఎక్స్ 100'. ఈ సినిమా ద్వారా హీరో కార్తికేయకి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో కుర్రాళ్లంతా ఆయన తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమా ఖరారైంది. తెలుగు .. తమిళ భాషల్లో కలైపులి థాను నిర్మిస్తోన్న ఈ సినిమాకి టి.ఎన్.కృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ సినిమాకి 'హిప్పీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజున కార్తికేయ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు ఉంటారట. ప్రస్తుతం వాళ్ల ఎంపికకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ నుంచి హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.           

More Telugu News